అదీ.. ఆమె తెగింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే ఫ్యాషన్. కథపరంగా ఓ పాత్ర డిమాండ్ చేసినపుడు -దేనికైనా తెగింపు చూపించే గట్స్ ఆర్టిస్టులకుండాలి. అలాంటి గట్స్ చూపించటంలో ‘ఆమె’ అగ్రభాగాన నిలుస్తుందంటూ అంతర్జాలంలో ప్రశంసలు కురుస్తున్నాయి. ‘ఆమె’ ఎవరో కాదు -అమలాపాల్. తమిళంలో ‘ఆడై’ పేరిట నిర్మితమైన సినిమా తెలుగులో -ఆమె పేరిట విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి సంకేతంగా వదిలిన టీజర్ ఇప్పుడు అంతర్జాలంలో సంచలనమే అవుతోంది. ఈ సంచలనానికి కారణం -అమలాపాల్. నిర్మానుష్యంగావున్న భవంతిలో అమలాపాల్ భయాందోళనల మధ్య పూర్తి నగ్నంగా కనిపించటమే టీజర్‌లో హైలెట్ సీన్. మద్యం మత్తులో తప్పిపోయిన బిడ్డ, ఆమెకోసం తల్లిపడే తపన.. సినిమా ప్రధాన ఇతివృత్తం ఇదేనంటున్నారు. సినిమాపై ఆసక్తి పెంచేందుకు టీజర్‌లో జిమ్మిక్కులు చేయడం మామూలే. అయితే, గతంలో ఎవరూ చేయలేని సాహసాన్ని మాత్రం అమలాపాల్ చేసిందంటూ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సంచలనం సృష్టిస్తోన్న టీజర్‌ను హిందీలో కరణజోహార్, తెలుగులో రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు.