హాలీవుడ్.. పిలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమధ్య పరిశ్రమలో వరుస అవకాశాలను వదులుకుని షాకిచ్చింది శృతిసాసన్. ప్రియుడు మైఖేల్ మైకంలో శృతి పూర్తిగా మునిగిందంటూ క్రమంగా ఆమెను అప్రోచ్ అవ్వడం మానేశారు దర్శక, నిర్మాతలు. లవర్‌తో పేచీలొచ్చి ఇద్దరూ ఎడబాటుకు సిద్ధమవ్వడంతో -మళ్లీ స్క్రీన్ ప్రజెన్స్‌పై దృష్టిపెట్టింది శృతిహాసన్. ఒకటి రెండు ఆఫర్లతో సరిపెట్టుకోక తప్పదులే అనుకున్న వాళ్లంతా షాక్ తినేలా -శృతి ఏకంగా హాలీవుడ్ చాన్స్‌లే అందుకుంటోంది. యుఎస్‌ఏ నెట్‌వర్క్స్ నిర్మించనున్న ట్రెండ్ స్టోన్ సిరీస్‌లో కీలకపాత్రకు నిర్మాతలు శృతిని సంప్రదించారట. ఆమె కూడా ఓకే అనడంతో -వెయిట్రెస్ ముసుగులో హత్యలకు పాల్పడే కిల్లర్‌గా శృతి కనిపించే అవకాశం ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఇప్పటికే హాలీవుడ్‌లో పాగావేసిన ప్రియాంకా చోప్రా మాదిరే -ఈ సిరిస్ హిట్టయితే శృతి రేంజ్ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు.