కంటెంట్‌లో దమ్ముంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ స్థానం ఒకింత ప్రత్యేకం. అలాంటి సంస్థనుంచి వస్తోన్న 46వ చిత్రం -కౌసల్యా కృష్ణమూర్తి. తమిళంలో విజయం సాధించిన ‘కణ’కు ఇది రీమేక్. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్‌రాజు, వెనె్నల కిశోర్, శివ కార్తికేయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం గురించి నిర్మాత కెఎస్ రామారావు మాట్లాడుతూ- కౌసల్యా కృష్ణమూర్తి 24న సెన్సార్‌కెళ్తుంది. తమిళం, హిందీ, మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్. తెలుగులో ఈమెను మేమే పరిచయం చేస్తున్నాం. ఐశ్వర్య తండ్రి రాజేష్. ఆర్టిస్టు శ్రీలక్ష్మికి ఈమె మేనకోడలు. ఇక కౌసల్యా.. చిత్రం పూర్తిగా తండ్రీ కూతుళ్ల అనుబంధంతో సాగుతుంది. పల్లెటూళ్లో పుట్టిన పిల్ల అకుంఠిత దీక్షతో ఎదిగి క్రికెట్‌లో భారత్‌కు ఎలాంటి వనె్న తెచ్చిందన్నదే కానె్సప్ట్. మార్చిలో మొదలుపెట్టి 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమా కోసం ఐశ్వర్య క్రికెట్‌లో శిక్షణ తీసుకుంది. కోచ్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపిస్తాడు. తమిళ మాతృకను తెలుగులో యథాతథంగా తీశాం. జూలై 2న ప్రీ రిలీజ్ వేడుకకు మిథాలీరాజ్‌ను ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిల్లో నిగూఢమైన శక్తి ఏమిటి? వాళ్ల లక్ష్యాలను తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రోత్సహించాలి? వంటి అంశాలు సినిమాలో చూస్తారు. ఆడియోని సోమవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. కంటెంట్‌లో దమ్ముంటే సినిమా ఆడుతుందన్న నమ్మకంతో రీమేక్ చేసిన సినిమా ఇది అన్నారు.