సంక్రాంతి కానుకగా నాన్నకు ప్రేమతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 15తో అక్కడి షూటింగ్ పూర్తవుతుందని, ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని అన్నారు. లండన్, స్పెయిన్‌లాంటి కొత్త ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, పాటలు అద్భుతంగా వచ్చాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందన్నారు. ఈనెల చివరివారంలో పాటలను విడుదలచేసి జనవరి 13న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నామన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, కెమెరా:విజయ్ చక్రవర్తి, ఆర్ట్:రవీందర్, ఎడిటింగ్:నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకత్వం:సుకుమార్.