రష్మి భయపెడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జబర్దస్త్’ యాంకర్ రష్మి ప్రధాన పాత్రలో జానీ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతోంది. సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘కిల్లింగ్ వీరప్పన్’, విశాల్ ‘కథకళి’ చిత్రాల్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీకృష్ణా క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇది. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ఇంకా ఖరారు కాలేదు. నిర్మాత గౌరీకృష్ణ ఈ సినిమా విశేషాలు చెప్పారు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రష్మి ప్రధాన పాత్రలో నటిస్తోందని, హారర్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటకే 50 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. మిగతా షూటింగ్‌ని త్వరలోనే పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే బిజినెస్‌పరంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని, సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చిందన్నారు. సూర్య, మధునందన్, సమ్మెట గాంధి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:వెంకటేష్ శృంగవరపు, ఆర్ట్:నాగు, కెమెరా:బాల్‌రెడ్డి, మాటలు:చంద్రమోహన్, నిర్మాత:గౌరీకృష్ణ, దర్శకత్వం:జాని.