గుండెల్లో ఉండిపోతుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుణ్ తేజ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నవీన్ నాయిని దర్శకత్వంలో లింగేశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం -ఉండిపోరాదే. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తండ్రి గొప్పదనాన్ని తెలియజేసే పాటను విడుదల చేశారు. సాబూ వర్గీస్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పోస్ట్ ప్రొడక్షన్స్ దశలోవున్న చిత్రాన్ని జూలై చివరి వారంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ -అశోక్‌తేజ సాహిత్యం, చిత్రమ్మ గాత్రంలో తండ్రి కోసం కూతురు పాటే పాట ఉన్నత విలువలను చాటిచెప్తోందన్నారు. ఆడపిల్లని చిన్నచూపు చూడొద్దు. వాళ్ల పుట్టుక చాలా అవసరం అని తెలియజెప్పే పాటతో కొంతైనా సామాజిక దృక్ఫధం మారుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. నిర్మాత లింగేశ్వర రావు, దర్శకుడు నవీన్ నాయినికి ఈ ప్రాజెక్టుతో మంచి విజయం అందాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు సాబు వర్గీస్ మాట్లాడుతూ -ప్రతి పాటా సందర్భానుసారం వస్తుంది. దర్శక నిర్మాతలు ఇచ్చిన స్వేచ్ఛతో మంచి బాణీలు సమకూర్చగలిగాను. చిత్రబృందానికి మంచి విజయం అందాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు నవీన్ నాయిని మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాపై బాధ్యతలు మోపిన నిర్మాత లింగేశ్వర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఇదో యథార్థ కథ. పక్కింటి అమ్మాయి జీవితాన్ని చూస్తున్నామన్న భావన కలుగుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధానికి ఈ పాట పరాకాష్ట అన్నారు. నిర్మాత లింగేశ్వర్ మాట్లాడుతూ ‘చూసే ప్రతి సినిమానూ అనాలసిస్ చేసుకోవడం అలవాటు. అటువంటిది తీసే సినిమాపై ఎంత అనాలసిస్ చేసుంటానో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఎమోషనల్ స్టోరీ ఇంతవరకూ తెరపైకి వచ్చిందని నేననుకోవడం లేదు. కడవరకూ ప్రేమ చూపించేది తల్లిదండ్రులేనన్న వాస్తవాన్ని ఆసక్తికరమైన కథలో చూపిస్తూ పిల్లల బాధ్యతల్ని గుర్తు చేసే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గది. కథపై ఎంతో నమ్మకంతో ఉన్నాం కనుకనే -మూడు భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. హీరో తరుణ్ తేజ్ మాట్లాడుతూ -సినిమా బాగా వచ్చింది. అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు.