తలచినదే.. జరిగినదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షైన్ పిక్సర్స్ బ్యానర్‌పై రామ్‌కార్తీక్, ఊర్వశి పరదేశి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు సూర్య తేజ తెరకెక్కించనున్న -తలచినదే జరిగినదా సినిమా సోమవారం మొదలైంది. ముఖ్య అతిథిగా నిర్మాత సి కళ్యాణ్ హాజరై క్లాప్‌నిచ్చారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఎం హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. దండు సినిమా దర్శకుడు సంజీవ్‌కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు సూర్యతేజ మాట్లాడుతూ ‘తలచినదే జరిగినదా’ కథ వినగానే సినిమా చేయడానికి హీరో రామ్‌కార్తీక్, నిర్మాత శేఖర్‌రెడ్డి అంగీకరించారు. రెండువేల ఏళ్ల క్రితంనాంటి జీవితాలకు, ఇప్పటి లైఫ్ స్టయిల్ మధ్య తేడా తెలిపే ఫిక్షన్ స్టోరీ ఇది. చాలాకారం తరువాత బెస్ట్ తెలుగు సినిమా వస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్స్ ఈ కథను మీ ముందుకు తెస్తున్నారు అన్నాడు. నిర్మాత శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇది కామెడీతో కూడిన ఫిక్షనల థ్రిల్లర్. జూలై 8నుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెడుతున్నాం. హైదరాబాద్, గోవా ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం అన్నారు. హీరో రామ్‌కార్తీక్ మాట్లాడుతూ -వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ప్రాజెక్టు తరువాత చేస్తున్న చిత్రమిది. ఆకట్టుకునే ఫిక్షన్ అన్నాడు. తెలంగాణ భాష, సాంస్కృతిక సంచాలకుడు హరికృష్ణ మాట్లాడుతూ కంటెంట్‌పై నమ్మకంతో ఓ యంగ్ దర్శకుడు చేస్తున్న సాహసమిది. దర్శకుడి రెండేళ్ల కృషికి నిర్మాతలు మంచి సహకారం అందుతోంది. ఈ ప్రాజెక్టు రామ్‌కార్తీక్, ఊర్వది పరదేశికి మంచి ఫ్లాట్ ఫామ్ అవ్వడం ఖాయం. యూనిట్‌కు బెస్ట్ విషెస్ అన్నారు.