మొదలైంది అర్జునవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుసాయివంశీ, శ్రావణి నిక్కీ, హిమబింధు ప్రధాన తారాగణంగా -అర్జునవేట మొదలైంది. దర్శకుడు కె రవీంద్ర కల్యాణ్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని రోజా శ్రీనివాస్ సినిమాస్ పతాకంపై వాయల శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి సి కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘రైస్ పుల్లింగ్ నేపథ్యంలో ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది’ అన్నారు. జూలై 16నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టి, హైదరాబాద్, చెన్నై, కేరళవంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తామని, ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. సుబ్బరాజు, వెనె్నల కిశోర్, రావురమేష్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సినిమాటోగ్రఫీ వెంకట్, సంగీతం డి. ఇమాన్ సమకూరుస్తున్నారు.