ప్రతిరోజూ పండగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రలహరితో ఒకింత ఊపిరి తీసుకున్న సాయితేజ్ కొత్త ప్రాజెక్టు మొదలెట్టేశాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి -ప్రతిరోజూ పండుగే టైటిల్‌ను కన్ఫర్మ్ చేయడం తెలిసిందే. తాజాగా ఆ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్తోంది. హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా సినిమాను మొదలెట్టిన చిత్రబృందం, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో సాయితేజ్‌తో రాశిఖన్నా జోడీకట్టింది. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయితేజ్‌కు ‘చిత్రలహరి’ ఒకింత ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. జిఏ2యువీ పిక్సర్చ్ బ్యానర్లో ప్రాజెక్టును భారీగా నిర్మించనున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. భలెభలె మగాడివోయ్, మహానుభావుడులాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మారుతి -ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోవాలన్న కసితో ఉన్నాడు. ఈ ప్రాజెక్టుతో తప్పకుండా హిట్టందుకోవాలన్న పట్టుదలతో హీరో సాయితేజ్ ఉన్నాడు.