రెండు బుర్రల కథ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది సాయికుమార్ ద్విపాత్రాభినయంలో, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లుగా డైమెంట్ రత్నబాబు తెరకెక్కిస్తోన్న చిత్రం -బుర్రకథ. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి నిర్మాతలు. సోమవారం సినిమా ట్రైలర్‌ను హీరో వెంకటేష్ విడుదల చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. వండర్‌ఫుల్ స్టోరీ. ఆది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డైమండ్ రత్నంబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనుకుంటున్నా అన్నారు. నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ -వెంకటేష్ చేతులమీదుగా ట్రైలర్ లాంచ్ ఆనందంగా ఉంది. సినిమా విడుదల హక్కులను వింటేజ్ క్రియేషన్స్ తీసుకుంది. 28న ‘బుర్రకథ’తో కాన్ఫిడెంట్‌గా మీముందుకు వస్తున్నాం అన్నారు. దర్శకుడు డైమెండ్ రత్నంబాబు మాట్లాడుతూ -ఒక హీరోపై నమ్మకంతోనే దర్శకుడు వస్తాడు. టాలెంట్ ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లను ప్రోత్సహించడానికి నిర్మాతలు అవసరం. నన్ను నమ్మిన వారికోసం ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేశాను. చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య బలమైన బాండింగ్‌నే కాదు, ఎంటర్‌టైనింగూ చూస్తారు. ఎమోషన్స్‌తో పాత్రలు కంటతడి పెట్టడం కాదు, ఆడియన్స్ కంటతడిపెడితే ఆ సినిమా హిట్టు. బుర్రకథ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ -ఈ ఎంటర్‌టైనర్ కోసం మేమంతా యుద్ధం చేయాల్సి వచ్చింది. కన్ఫ్యూజన్‌లేని యునీక్ లైన్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాం. నిర్మాతలు సపోర్ట్ కాదు, స్ట్రెంగ్త్ ఇచ్చారు. వెంకటేష్ ట్రైలర్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. చాలాకాలమైంది హిట్టుపడి. ఆ దాహం ఈ సినిమాతో తీరుతుందన్న నమ్మకంతో ఉన్నా అన్నారు.