Others

ఈ పట్నవాసం నాకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ సంధ్యారాగమే
కనిపించని ఈ పట్నవాసం నాకెందుకు?
‘అంబా’ అనే తువ్వాయ
గెంతులే కనిపించని
ఈ పట్నవాసం నాకెందుకు?
అమృతధారలే కురిపించే
గోమాతలే కానరాని
ఈ పట్నవాసం నాకెందుకు?
ఏ వీధి కేగినా
బాగున్నావా అనేవారు లేని
ఈ పట్నవాసం నాకెందుకు?
కనిపించిన ప్రతిసారీ
పద్యాలతో పలకరించే
తెనుగు మాస్టారు లేని
ఈ పట్నవాసం నాకెందుకు?
గుడిగంటలు వినిపించక
మైకులు హోరే వినిపించే
ఈ పట్నవాసం నాకెందుకు?
వెనె్నల్లో తడిసి ముద్దవ్వని
ఆరుబయలు నిద్ర లేని
ఈ పట్నవాసం నాకెందుకు?
బాధలే లేని లోగిళ్ళు
ఇంటింటికీ మధ్య
ఈ పట్నవాసం నాకెందుకు?
నిండు చూలాలిగా కనిపించే
చెరువు లేని
ఈ పట్నవాసం నాకెందుకు?
చూరునుండి కారే
ధారల సంగీతం వినిపించని
ఈ పట్నవాసం నాకెందుకు?
పైరుగాలి లేక
ప్రాణవాయువు కోసం
పరితపించే
ఈ పట్నవాసం నాకెందుకు?

- కొనకంచి మురళి, 9676787002