కొత్తగా.. కోలీవుడ్‌కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజన గాళ్రాణి కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోందట. అరుణ్ విజయ్, రితికాసింగ్ కలిసి నటిస్తోన్న ‘బాక్సర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోందట. తెలుగులో ‘సర్ణఖడ్గం’ ధారావాహికతో గుర్తింపు తెచ్చుకున్న సంజనా, ‘బుజ్జిగాడు’లాంటి పలు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించింది. హారర్ చిత్రాల్లోనూ కనిపించిన ఈ బ్యూటీ, కన్నడ, మలయాళ చిత్రాలే ఎక్కువ చేసింది. సంజన సోదరి నిక్కీ గాల్రాణి తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సంజన సైతం కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందన్న మాట. బాక్సర్‌గా అరుణ్ విజయ్ కనిపించనున్న చిత్రం ఇటీవలే పూజాధికాలు నిర్వహించుకుంది. ‘కోలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నా. గతంలోనూ చాలా అవకాశాలు వచ్చినా, మంచి ప్రాజెక్టు కోసం ఇంతకాలం ఎదురు చూశా. ఇప్పుడు ‘బాక్సర్’ సినిమాతో అడుగుపెడుతుంటం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్టులో నేను పోషిస్తోన్న పాత్రతో పరిశ్రమలో మంచి గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నా’ అంటోంది సంజన.