ఆ బంగళాలో డార్లింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళయరసన్, రమీజ్‌రాజా, మాయ, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్-2. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తూ హిట్‌వైపు దూసుకుపోతూండగా తెలుగులోకి అందిస్తున్నారు. ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్‌చౌదర్ గోగినేని సమర్పణలో మాధురి బొల్లు నిర్మిస్తున్నారు. సతీష్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా నిర్మాత మాధురి బొల్లు మాట్లాడుతూ, ఎక్కడా రాజీపడకుండా స్ట్రెయిట్ సినిమాల డబ్బింగ్ పూర్తిచేశామని, మధురై సమీపంలోని ఓ ఫారెస్టులో అధిక భాగం షూటింగ్ జరుపుకుంటోందని, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ చంద్రశేఖరన్‌తోపాటు మరో నలుగురు మిత్రులకు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిదని చెప్పారు. ఐదుగురు మిత్రులు అడవిలోకి పిక్నిక్ వెళతారని, అక్కడ ఉన్న బంగళలాలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే కథతో ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పారు.