పోస్ట్ ప్రొడక్షన్స్‌లో సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్పానిక కథతో మెగాస్టార్ చిరంజీవిని ఉద్యమ నేతగా చూపుతూ సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం -సైరా. సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సెట్‌లో దిగిన ఫొటోలనూ షేర్ చేశాడు. ‘సైరా’ షూటింగ్ పూరె్తైంది. ఎంతోశ్రమించి, మాకు సహకరించిన చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇదో మధురమైన ప్రయాణం. సినిమా చక్కగా రూపుదిద్దుకుంది’ అంటూ పోస్ట్ పెట్టాడు. 2017 డిసెంబర్‌లో ‘సైరా’ షూటింగ్ మొదలైంది. చిత్రీకరణ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో నిర్మాణం ఆలస్యమైంది. ఆగస్టు 22న సైరా ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా’లో మెగస్టార్ అప్పియరెన్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. విజయ్‌సేతుపతి, నయనతార, సుదీప్, అమితాబ్‌బచ్చన్, తమన్నా, జగపతిబాబు భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తుండటంతో -సైరా ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున సినిమాను థియేటర్లకు తేనున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమాపై మంచి అంచనాలున్నాయి.