పైటేసిన ముద్దబంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముద్దాబంతిపూవు ఇలా పైట వేసెనా/ ముద్దూ ముద్దూ చూపులతో గుండె కోసెనా’ అంటూ యాజిన్ నిజార్ పాడిన ‘కౌసల్య కృష్ణమూర్తి- ది క్రికెటర్’ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కృష్ణకాంత్ సాహిత్యానికి దిబు నినన్ థామస్ అద్భుతమైన బాణీ అందించారు. సినిమా తమిళ మాతృక ‘కణ’లోని ‘ఒతాయాడి పాదయిలా’ పాట ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెనే్సషన్ సృష్టించింది. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం -కౌసల్యా కృష్ణమూర్తి. నిర్మాత కెఎస్ రామారావు సమర్పణలో కెఎ వల్లభ సినిమా నిర్మిస్తున్నారు. తొలి పాట విడుదల సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ -తమిళంలో సెనే్సషన్ సృష్టించిన పాటను తెలుగులో విడుదల చేశాం. మంచి రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మ్యూజికల్‌గా పాట సినిమాకి పెద్ద హైలైట్’ అన్నారు. కెఎస్ రామారావు మాట్లాడుతూ ‘దిబు థామస్ బాణీ తెలుగులోనూ సెనే్సషన్ సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూలై 2న నిర్వహిస్తున్నాం. ఇండియన్ విమెన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ అతిథిగా హజరవుతారు’ అన్నారు. హీరో కార్తీక్‌రాజు మాట్లాడుతూ -‘క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో నటించాలన్నది నా డ్రీమ్. ఈ ప్రాజెక్టుతో నెరవేరడం హ్యాపీగా ఉంది. నేను, ఐశ్వర్యా నటించిన ‘ముద్దబంతి.. ’ పాటతో మ్యూజిక్ లాంచ్ అవ్వడం మరింత ఆనందం అన్నారు. నిర్మాత కెఎ వల్లభ మాట్లాడుతూ ‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుంది.జూలై రెండో వారంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.