మహర్షి ఫంక్షన్‌కి జెర్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్‌బాబు మేఘాల్లో తేలపోతున్నాడు. మొన్నటి వరకూ యూరోప్ ట్రిప్‌లో ‘మహర్షి’ సక్సెస్ ఆనందాన్ని ఎంజాయ్ చేసిన మహేశ్ -మరో రెండురోజుల్లో ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాడు. మహేశ్ కెరీర్ సిల్వర్ జూబ్లీ ఫినిషింగ్ ప్రాజెక్టుగా ‘మహర్షి’ తెరకెక్కడం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. ఈ ప్రాజెక్టులో మహేశ్‌కు జోడీగా పూజా హెగ్దె నటించింది. మే 9న విడుదలైన సినిమా అన్ని ప్రాంతాల్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండటమే కాదు, జూన్ 27కు ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్‌కు చేరుకుంటుంది. 200 కేంద్రాల్లో సినిమా అర్థ శత దినోత్సవానికి చేరడంతో -సినిమా బృందం సెలబ్రేషన్స్‌కు సిద్ధమైంది. 28న హైదరాబాద్ శిల్పకళా వేదికపై ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వేడుకకు చీఫ్ గెస్ట్‌గా జెర్సీతో సూపర్ హిట్ అందుకున్న నాని హాజరవుతాడని సమాచారం. సో, ఇటు మహేశ్, అటు నాని ఫ్యాన్స్‌కి 28న పండుగ రోజే.