24 ఏమిటో సినిమాయే చెబుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు సూర్య, సమంత, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో విక్రం కె.కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టూడియో గ్రీన్ పతాకాలపై సూర్య నిర్మిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రం మే 6న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సూర్య మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలైన తరువాత అదే మాట్లాడుతుందని, ఈ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో సినిమా చేశానని, రెహమాన్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందని అన్నారు. ‘శంకరాభరణం’, ‘అన్నమయ్య’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి భిన్నమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, అలాగే ఈ సినిమా కూడా భిన్నంగా వుంటుందని, తన కెరీర్‌లో ఇది విభిన్నమైన సినిమా అన్నారు. దర్శకుడు విక్రం కె.కుమార్ మాట్లాడుతూ, సూర్య లేకపోతే ఇంత పెద్ద సినిమా చేసేవాడిని కాదని, ఈ సినిమాలో ఆత్రేయ అనే బెస్ట్ కారెక్టర్ ఉందని, సమంత, నిత్యామీనన్ అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకుంటారని, ముఖ్యంగా తన సంగీతంతో సినిమాను మరో లెవల్‌కు రెహమాన్ తీసుకువెళ్లారని, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా కొత్త ప్రెజెంటేషన్‌తో తెరకెక్కించామని అన్నారు. జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ సినిమాను మే 6న విడుదల చేస్తున్నాం. సూర్య కెరీర్‌లో బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుందని అన్నారు.