ప్రయోగాలు చేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒకే రకమైన పాత్రల్లో నటించాలంటే నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకనే విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది’ అని అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఇంటర్వ్యూ..
మీ పాత్ర గురించి?
- సినిమాలో నాది మంచి పాత్ర. నా పాత్రకు మంచి ఇంపాక్ట్ ఉండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో మహాలక్ష్మి పాత్రలో కన్పిస్తాను. రాజమండ్రి యాసలో వుంటుంది. అందుకని డబ్బింగ్ చెప్పడానికి కుదరలేదు. ముఖ్యంగా నటనకు మంచి స్కోప్ వున్న పాత్రని చెప్పచ్చు.
ఈ సినిమా కోసం
ఏదైనా హోంవర్క్ చేశారా?
- లేదు. ప్రత్యేకంగా ఎలాంటి హోంవర్క్ చేయలేదు. డైరెక్టర్ చెప్పింది విని చేశాను. ఆయన ప్రతి ఒక్కరి పాత్రను నటించి మరీ చూపించేవారు. ఆయన మాట వింటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు.
అల్లు అర్జున్‌తో పనిచేయడం?
- అల్లు అర్జున్ మంచి నటుడే కాదు పర్‌ఫెక్ట్ డాన్సర్ కూడా. నేను గత రెండు మూడు సినిమాలు మంచి డాన్సర్స్ అయిన హీరోలతో సినిమా చేస్తున్నాను. వారివల్ల నాకు కూడా డాన్స్ ఇంప్రూవ్ అవుతోంది. బన్నీ సినిమా విషయంలో చాలా డెడికేషన్‌తో వుంటాడు. తన తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తనతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.
బన్నీ, చరణ్‌లలో ఎవరు బెస్ట్?
- ఇద్దరినీ పోల్చడం కరెక్ట్ కాదు. ఇద్దరూ మంచి డాన్సర్స్. నాకు తెలిసి వాళ్ల బాడీలో ఎముకలు లేవనుకుంటా. ఎలాంటి స్టెప్స్ అయినా సులువుగా వేసేస్తారు. ఎవరి స్టైల్ వారిది.
బోయపాటి శ్రీను గురించి?
- బోయపాటిగారి సినిమాల్లో మంచి ఎమోషన్ వుంటుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు ఆయన పెట్టింది పేరు. ఇలాంటి సినిమాల్లో హీరోలకే ప్రాముఖ్యత వుందనుకుంటారు. కానీ హీరోయిన్లకు కూడా ఇంపార్టెన్స్ వుంటుంది.
ఈమధ్య వరుసగా మెగా హీరోల
సినిమాల్లోనే నటిస్తున్నారు, కారణం?
- అవును. మెగా హీరోలతో వరుసగా చేయడానికి ఎలాంటి కారణాలు లేవు. పైగా ఇది ప్లాన్ చేసింది కూడా కాదు. వచ్చిన కథల్లో మంచి పాత్రలు వుంటే చేస్తున్నాను.
కొత్తగా ఇల్లు కొన్నారు, ఎలా వుంది?
- చాలా ఆనందంగా వుంది, హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కోవడం. నేను ఒక్కో రూపాయి పోగుజేసి కొనుక్కున్నాను. ప్రతి మనిషికి కావాల్సిన మినిమమ్ అవసరాలు అన్నీ తీరాయి. ఇల్లు కొనుక్కోవడంలో మా నాన్నగారి సపోర్టు కూడా వుంది. కానీ, ఈ ఇల్లు నాకు ఎవరో కొనిచ్చారనే రూమర్స్ వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజాలు లేవు.
మీ జిమ్ బిజినెస్ ఎలా వుంది?
- బిజినెస్ బాగా నడుస్తోంది. పెట్టిన నెల రోజులకే మంచిపేరు వచ్చింది. చాలామంది జాయిన్ అవుతున్నారు.
హీరోయిన్ల ఆత్మహత్యల గురించి
మీ అభిప్రాయం?
- ప్రతీ హీరోయిన్‌కు సినిమా లైఫ్‌తోపాటు ప్రైవేటు లైఫ్ వుంటుంది. ఆ లైఫ్‌లో తప్పు చేస్తే తల్లిదండ్రులు కోప్పడతారనే భయం ఉండాలి. దాంతోపాటు మనం ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు, దగ్గరి స్నేహితులతో షేర్ చేసుకుంటే మనపై వున్న ఒత్తిడి తగ్గిపోతుంది. చాలామంది ఇలాంటివి దాచేసి ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. మన పని మనం కరెక్టుగా చేస్తే చాలు, అదే మనకు రిజల్ట్‌నిస్తుంది. నేను కూడా షూటింగ్ లేనపుడు ఫ్రెండ్స్‌తో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాను.
ఎలాంటి పాత్రలు చేయాలని వుంది
- ఒకే రకమైన పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రయోగాలు కూడా చేయాలని వుంది. ఒక పాత్ర చేస్తున్నామంటే అది మనల్ని ఎగ్జైట్ చేసేలా వుండాలి.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం చరణ్‌తో నటిస్తున్న ‘తని ఒరువన్’ రీమేక్ సినిమా షూటింగ్‌లో మే నుంచి పాల్గొంటాను. దాంతోపాటు తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాను.

- శ్రీ