ఆకట్టుకునే మదగజరాజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన తారాగణంగా శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్.సి దర్శకత్వంలో తమటం కుమార్‌రెడ్డి అందిస్తున్న చిత్రం ‘మదగజరాజ’. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఆడియో విడుదల కార్యక్రమంలో బిగ్ సీడీని, ఆడియో సీడీని హీరో విశాల్ విడుదల చేసి నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అందించారు. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ, సుందర్ దర్శకత్వంలో తొలిసారిగా తాను నటించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, కామెడీ హైలెట్‌గా వుండే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలవల్ల ఆలస్యమైందని అన్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా యూత్‌ఫుల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ల నటన, గ్లామర్ హైలెట్‌గా వుంటుందని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు సి.సుందర్ తెలిపారు. తాను గతంలో విడుదల చేసిన చిత్రాల స్థాయిలోనే రూపొందిన ఈ చిత్రం అంతే విజయవంతం అవుతుందని నిర్మాత తమటం కుమార్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మి శరత్‌కుమార్, విజయ్ ఆంటోని తదితరులు పాల్గొన్నారు. సదా, సోనూ సూద్, సుబ్బరాజు, సంతానం, శరత్ సక్సేనా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:రిచర్డ్స్, ఎడిటింగ్:ప్రవీణ్.కె.ఎల్., సంగీతం:విజయ్ ఆంటోని, మాటలు:శశాంక్ వెనె్నలకంటి, నిర్మాత:తమటం కుమార్‌రెడ్డి, దర్శకత్వం:సి.సుందర్.