పాయల్.. పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆర్‌ఎక్స్ 100’తో యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది పాయల్ రాజ్‌పుత్. దీంతో వరుస అవకాశాలు వస్తున్నా -నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ముందుకెళ్తోంది పాయల్. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రాజెక్టులో ‘లేడీ పోలీస్’ పాత్ర దక్కించుకుంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ను తెరకెక్కిస్తోన్న దర్శకుడు వంశీకృష్ణ -పాయల్‌ను పోలీస్‌గా చూపించనున్నాడని అంటున్నారు. 1980-90 దశకాల్లో తెలుగు రాష్ట్రాన్ని గడగడలాడించిన స్టూవర్ట్‌పురం గజదొంగ -టైగర్ నాగేశ్వరరావు. దోపిడీలు, హత్యలతో భయానక వాతావరణాన్ని సృష్టించాడు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో గజదొంగ జీవిత చరిత్రనే వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ప్రాజెక్టులోకి పాయల్‌ను తీసుకున్నట్టు గతంలోనే సమాచారం పొక్కినా, వేశ్యపాత్ర కోసం అనుకున్నారు. కానీ ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందన్నది లేటెస్ట్ సమాచారం. బెల్లంకొండకు అక్కగా రేణుదేశాయ్ కనిపించనుందనే టాక్ ఎంతవరకు వాస్తవమో వేచి చూడాలి.