వత్తిడికి.. వినోదం మందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరొనాక్, ప్రీతి అశ్రాని హీరో హీరోయిన్లుగా సుజై -సుశీల్ దర్శక నిర్మాతలుగా రూపొందిన చిత్రం -ప్రెజర్ కుక్కర్. ఎ అప్పిరెడ్డి మరో నిర్మాత. యువ హీరో సందీప్ కిషన్ -సినిమా ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. పాట బావుంది. లిరిక్ డిఫరెంట్‌గా ఉంది. ఆడియన్స్‌కి త్వరగా రీచవుతుంది. యూనిట్‌కు ‘ఆల్ ది బెస్ట్’ అన్నాడు. దర్శక నిర్మాత సుజై మాట్లాడుతూ -యూత్‌కి మంచి మెసేజ్‌వుంది. కథకుతగిన సంగీతాన్ని ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అందించారన్నారు. సంగీత దర్శకుడు రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ -నువ్వు అయిపోతావురా లంగా అన్న పాటను తెలంగాణ మాండలికంలో కంపోజ్ చేశాం. సినిమాకోసం పడిన కష్టాన్ని ఎంజాయ్ చేశాం. తప్పకుండా పాట నచ్చుతుందని అనుకుంటున్నా అన్నాడు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ -డిగ్రీకాగానే ఉద్యోగం చేయాలి, ఫారిన్ వెళ్లాలన్న ఆలోచన వస్తుంది. లైఫ్‌లో ప్రతి పనికీ ఓ ప్రెజరుంటుంది. అలాంటి ప్రజెర్స్‌ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడన్నదే కథ. యూత్‌కి మంచి మెసేజ్ అందుతుంది అన్నారు. హీరోయిన్ ప్రీతి మాట్లాడుతూ -డిఫరెంట్ క్రేజీ సాంగ్‌ను వదిలారు. ఆడియన్స్‌కి ఈ పాట ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ అన్నారు. హీరో సాయిరొనాక్ మాట్లాడుతూ -యూఎస్ వెళ్లాలి అన్న ఆలోచన మానసికంగా ఎంత వత్తిడికి గురిచేస్తుందీ అన్న విషయాన్ని ఎంటర్‌టైనింగ్‌గా, సెటైరికల్‌గా చెప్పాం. అందరికీ కనెక్టయ్యే సినిమా ఇది అన్నాడు.