కొత్త కథలే చెబుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంభాషణల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడయ్యాడు. వైవిధ్యమైన రెండు మెదళ్ల పనితీరును ‘బుర్రకథ’గా చూపించబోతున్నాడు. ఆది సాయికుమార్ హీరో. నేడు సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రత్నబాబు మీడియాతో మాట్లాడాడు.

రైటర్ నుంచి దర్శకుడవ్వాలంటే మంచి కథ దొరకాలి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డైరెక్టర్ కావాలనుకున్నా. ‘గాయత్రి’ తర్వాత ఈ పాయింట్ తట్టింది. ఒక ఫోన్‌లో రెండు సిమ్‌లున్నట్టు -ఒక మనిషికి రెండు బుర్రలుంటే...? -అలా పుట్టిందే బుర్ర కథ. ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే.. ఒకడు బాగా అల్లరి చేస్తే మరొకడు సైలెంట్. అలా కొంత రీసెర్చ్ చేసి అభిరాం క్యారెక్టర్ రాసుకున్నా. ఆ క్యారెక్టర్‌లో ఉండే షేడ్స్ ప్రతీ కుటుంబంలో ఉండేవే. కాకపోతే దానికి సైంటిఫిక్ అంశాన్ని జోడించానంతే. కథను కొందరు నిర్మాతలకు వినిపించాను. విన్న వెంటనే ఇది కొరియన్ సినిమాలో పాయింటా? హాలీవుడ్ సినిమాలో పాయింట్.. అంటూ అడిగారు. అలా అడిగిన ప్రతీసారి ఇది నా సొంత కథ అంటూ చెప్పుకొచ్చాను. కొందరైతే ‘ఏ మెన్ విత్ టూ బ్రైన్స్’ అనే పోస్టర్ చూసి నేను చెప్పిన కథ అదే అనుకున్నారు. కానీ అది స్ప్లిట్ పర్సనాలిటీ కథతో తెరకెక్కిన సినిమా. ఈ పాయింట్‌తో ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు.
* కొందరు నిర్మాతలకు కథ చెప్పాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్‌గా దీపాల ఆర్ట్స్ శ్రీకాంత్‌కు చెప్పా. ఆయనకీ కానె్సప్ట్ నచ్చింది. ఆదిని ఆయనే సజెస్ట్ చేశారు. తర్వాత ఆదికి కథ చెప్పడం, తనకీ ఎగ్జైటింగ్‌గా అనిపించడంతో సినిమా చేశాం.
* ఈ కథకి ముందుగా వీడు క్లాసు- వాడు మాస్. హలోబ్రదర్ అనే టైటిల్స్ అనుకున్నా. కానీ నా దగ్గర రైటర్‌గా చేస్తున్న ప్రసాద్ అనే కుర్రాడు ‘బుర్రకథ’ టైటిల్ సజెస్ట్ చేశాడు. కథకి యాప్ట్ టైటిల్ అనిపించింది. వెంటనే అతనికి ఓ చెక్ రాసి ఇచ్చాను.
* పుట్టుకతోనే రెండు బుర్రలున్న పాయింట్‌తో పది వర్షన్స్ రాసుకోవవచ్చు. అందులో నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఎంచుకున్నా. కథ ఎలాగున్నా సినిమాలో అన్నీ ఉండాలనుకునే ఆలోచన నాది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా హిలేరియస్ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కించా. బాలీవుడ్‌లో కూడా ఈ పాయింట్‌తో సీరియస్ సినిమా చేయొచ్చు. ఆల్రెడీ సోనీ వాళ్లను సంప్రదించడం జరిగింది.
* నేను డైరెక్ట్ చేసిన సినిమా చూస్తూ ప్రేక్షకుడు విందు భోజనంలా ఫీలవ్వాలి. నా సినిమాలో మంచి కథ, కథనం, పాటలు, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా అన్నీ ఉండాలనుకుంటాను. బుర్రకథలో ఇవన్నీ ఉంటాయి.
* సుస్వాగతం సినిమాలో పవన్‌కల్యాణ్- రఘువరన్ ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం. తండ్రి కొడుకుల మధ్య ఒక ఫ్రెండ్షిప్‌ని ఆ సినిమాలో బాగా చూపించారు. బుర్రకథలో ఆది, రాజేంద్రప్రసాద్ మధ్య ఫ్రెండ్షిప్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ బాగా కుదిరింది.
* ‘బుర్రకథ’ టీజర్ రిలీజవ్వగానే ఓ ఇద్దరు నిర్మాతలు ఫోన్ చేసి మీ సినిమా హిట్, ప్లాప్‌తో సంబంధం లేదండీ, నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ తీసుకోండన్నారు. అక్కడే డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యానని అనిపించింది. రాసినోడే బొమ్మ తీస్తే బావుంటుంది. ఇప్పుడొస్తున్న యంగ్ డైరెక్టర్సే నిదర్శనం.
* ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామనే వచ్చాను కాబట్టి కేవలం రైటర్‌లానే కాకుండా డైరెక్టర్‌లా ట్రావెల్ చేసేవాణ్ణి.
* బుర్రకథ- సినిమా డైరెక్ట్ చేయాలనీ అనుకున్నప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. అందుకే స్క్రీన్‌ప్లే కూడా ఐదుగురితో రాయించా. దర్శకుడవ్వాలనుకునే రైటర్‌కి, కొత్త దర్శకులకి నేను ఆదర్శం అవ్వాలి కానీ... వారి ప్రయత్నానికి నేను అడ్డుకాకూడదు. ఆ ఉద్దేశ్యంతోనే దర్శకుడిగా రాత్రీపగలు కష్టపడ్డాను. ఇక నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. ‘బుర్రకథ’ రిలీజ్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్నది డిసైడ్ చేస్తాను.