ఇస్మార్ట్ మాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతకాలంగా ఊరిస్తోన్న ఇస్మార్ట్ శంకర్ -ట్రైలర్‌లో ప్రత్యక్షమయ్యాడు. హీరో రామ్‌ను పక్కా పాతబస్తీ కుర్రాడిలా చూపిస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం -ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రం కనుక -ట్రైలర్‌ను సైతం అంతే మాసీగా కట్ చేశారు. రామ్ మేకోవర్‌ను ఫోకస్ చేస్తూ యాక్షన్ ఎపిసోడ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘ఏ బొమ్మా.. నువ్వు ఊ అంటే గోల్కొండ నీపేర జేసి నీ చేతిలో పెడతా. నిన్ను బేగంను చేసి ఖిల్లా మీద కూర్చొబెడతా. క్యా బోల్తే.. ఆ’ అంటూ రామ్ వాయిస్ ఓవర్ డైలాగ్ పూరి స్టైల్, స్టామినాను రుచి చూపిస్తోంది. ‘నా దిమాక్ ఏమైందిరా. డబుల్ సిమ్ కార్డు లెక్కుంది’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ -మాస్‌కి కనెక్టయ్యేలా ఉంది. తనను టీజ్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్‌ను హెచ్చరిస్తున్నట్టు ‘ఒరేయ్, వరంగల్ కాలేజీలో పొరగాళ్లను పాస్ పోయించినా’ అంటూ నభానటేశ్ చెప్పిన డైలాగ్ సినిమాలోని మాసిజాన్ని చెప్పకనే చెబుతోంది. ‘రాయ రాయె రాయ రాయె మైసమ్మ/ బల్కంపేట ఎల్లమ్మవే/ మా తల్లి బంగారు మైసమ్మవే’ అంటూ సాగే గ్రూప్ మాస్ సాంగ్‌లో రామ్ కొత్తగా కనిపించాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 18న ప్రేక్షకుల ముందుకురానుంది. కొంతకాలంగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న దర్శకుడు పూరి, హీరో రామ్ సైతం ఈ సినిమాతో ‘ఇస్మార్ట్’నెస్ పెంచుకోడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.