19న లయన్ కింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతువులు మాట్లాడుకంటాయి. ప్రేమని ప్రదర్శించుకుంటాయి. స్నేహం చేస్తాయి. ఇదంతా డిస్నీ ప్రపంచంలో. ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రత్యక్షం కాబోతోంది -ది లయన్ కింగ్. డిస్నీ కథలకి పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచడానికి పాత్రలకి సూపర్‌స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పించి కథకు కొత్త హంగులద్దారు. చిత్రంలో అతి కీలకమైన ముసాఫా పాత్రకి హిందీలో షారుఖ్‌ఖాన్, తెలుగు, తమిళంలో పి రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. అలాగే లయన్ కింగ్‌లో హీరో సింబా పాత్రకి హిందీలో షారుఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్ డబ్బింగ్ చెప్తే, తెలుగులో నేచురల్‌స్టార్ నాని చెప్పారు. అలాగే తమిళంలో హీరో సిద్ధార్థ చెప్పారు. విలన్ పాత్రధారి స్కార్ పాత్రకి బాలీవుడ్‌లో ఆశీష్ విద్యార్థి చెప్పగా, తెలుగులో జగపతిబాబు, తమిళంలో అరవిందస్వామి చెప్పారు. టైమ్ పాత్రకి బాలీవుడ్ నుండి శ్రేయాస్ తల్పాడే చెప్పగా, తెలుగులో కమెడియన్ అలీ, తమిళంలో సింగం పులి డబ్బింగ్ చెప్పారు. అలాగే మరో కామెడీ పాత్ర పుంబకి బాలీవుడ్‌లో సంజయ్ మిశ్రా, తెలుగులో బ్రహ్మానందం, తమిళంలో రోబో శంకర్‌లు డబ్బింగ్ చెప్పారు. ఆసక్తికరమైన అంశాలతో వసోతన్న లయన్ కింగ్ జూలై 19న ప్రపంచవ్యాప్తంగా గర్జిస్తాడట.