పెళ్లికి.. టైముందిలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూటీ శృతిహాసన్ మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టింది. గత ఏడాది ఒక్క సినిమాలోనూ నటించకుండా, ప్రేమాయణంలో మునిగితేలింది శృతిహాసన్. అలా కెరీర్‌ని పక్కన పెట్టేయడంతో -దర్శక నిర్మాతలు ఆమెను అప్రోచ్ కావడం మానేశారు. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో బ్రేక్‌అప్ చెప్పాక కొన్నిరోజులు ఎక్కడా కనిపించని శృతి, తమిళంలో ఓ టీవీ షో చేసి షాకిచ్చింది. ఇక టీవీ షోలపై దృష్టి పెడుతుందేమో అనుకునే టైంలో -సినిమాలపై దృష్టి పెట్టినట్టు సంకేతాలు పంపింది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు ఓకె చెప్పిన శృతి, తాజాగా రవితేజ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఫాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘మీ పెళ్లెప్పుడు?.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? మీ పెళ్లి ఎపుడో చెపితే మేము వస్తాం’ అంటూ చిలిపిగా అడిగాడు. దానికి సమాధానంగా శృతి ‘ఇప్పట్లో పెళ్లిచేసుకునే ఆలోచనే లేదు. దానికి ఇంకా టైముంది. వెయిట్ చేయాలి. అయితే నా బర్త్‌డే పార్టీకి మీరంతా రండి’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది. శృతిహాసన్ త్వరలోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరిగింది. లేటెస్టుగా శృతి స్పందించడపై ఆమె పెళ్లి విషయంపై అందరికీ క్లారిటీ వచ్చినట్టే!