నాయకి పాటే ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష, గణేష్ వెంకట్రామన్, సత్యం రా జేష్ ప్రధాన తారాగణంగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. చిత్రానికి సంబంధించిన పాటల సీడీ విడుదల కార్యక్రమంలో హీరో బాలకృష్ణ పాల్గొని బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని హీరోయిన్ త్రిషకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రధానమైన హైలెట్ త్రిష ఓ పాట పాడటమని, లేడీ ఓరియెంటెడ్ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ చాలా బాగుందన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుగా మెసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందించిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన కథను తాను ‘లయన్’ సినిమా షూటింగ్ సమయంలోనే త్రిషకు వినిపించామని, ఆమెకు నచ్చడంతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లిందని దర్శకుడు గోవి అన్నారు. సత్యం రాజేష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్ అతిథి పాత్రలో నటించారని, రఘు కుంచె సంగీతంలో ఈ పాటలన్నీ అందరికీ నచ్చుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతాన్ని, గతాన్ని కలిపి రాసుకున్న ఈ కథ సరికొత్తగా వుంటుందని, ఇది హారర్ మూవీ అనుకోవద్దని ఆయన తెలిపారు. రెట్రా హారర్ మూవీగా రూపొందించామని, 35 శాతం గ్రాఫిక్స్ హైలెట్‌గా వుంటాయని ఆయన అన్నారు. త్రిషతో ఓ థ్రిల్లర్ సినిమా నిర్మించాలనుకున్నానని, దర్శకుడు గోవి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా మొదలుపెట్టానని నిర్మాత గిరిధర్ అన్నారు. కథానాయిక పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని, సరికొత్త పాయింట్ ఈ సినిమాలో చర్చించామని ఆయన అన్నారు. రాజ్ కందుకూరి, గణేష్ వెంకట్రామన్, త్రిష, సత్యం రాజేష్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ సినిమాకి ఎడిటింగ్:గౌతంరాజు, పాటలు:్భస్కరభట్ల, సంగీతం:రఘు కుంచె, కెమెరా:జగదీష్ చీకటి, నిర్మాతలు:గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోవి.