నిజాయితీ కథలోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ దేవరకొండ, శివాత్మక హీరో హీరోయిన్లుగా స్క్రీన్‌కు
పరిచయమవుతున్న చిత్రం -దొరసాని. కేవీఆర్ మహేంద్ర
దర్శకుడు. మధుర ఎంటర్‌టైనె్మంట్, బిగ్ బెన్ సినిమా
సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం. సినిమా 12న విడుదలవుతున్న సందర్భంలో హీరో ఆనంద్ దేవరకొండ ఇంటర్వ్యూ.

1980లో జరిగే పీరియాడికల్ స్టోరీ ఇది. ఎక్కడా ఓవర్ చేయకుండా -దొరసాని కథను నిజాయితీతో చెప్పారు. కథను దర్శకుడు మహేంద్ర ఆరు గంటలు నెరేట్ చేశాడు. కథలోని నిజాయితీపై నమ్మకంతో సినిమా చేశా. పరిచయానికి ఇలాంటి కథ దొరకటం నా అదృష్టం.
యూఎస్‌లో ఎంఎస్ చేసి, అక్కడే జాబ్ చేస్తున్నా. అప్పటికి అన్న హీరో ప్రయత్నాల్లో ఉన్నాడు. తను అర్జున్‌రెడ్డి చేశాక చాలామంది మా నాన్నను అడిగారట. మీ పెద్దబ్బాయి డేట్స్ దొరకడం లేదు, మీ రెండో అబ్బాయి ఉన్నాడా? అని. అప్పటికే నాకూ హీరో అవ్వాలన్న కోరిక ఉంది. దాంతో జాబ్ మానేసి వచ్చేసా. ఇక్కడేం చేస్తావ్? అని అడిగితే అన్న ‘కింగ్ ఆఫ్ హిల్’ బ్యానర్, రౌడీ బ్రాండ్స్‌ని చూసుకుంటానని చెప్పా. ఆ టైంలోనే ఈ కథ వచ్చింది.
నా పాత్ర రియలిస్టిక్‌గా ఉంటుంది. సహజంగా కనిపిస్తాను, దొరసానిని ప్రేమించిన రాజులాగ. పాత్రలు రియల్ లైఫ్‌ను ప్రతిబింబిస్తే -ఆడియన్స్ కచ్చితంగా కనెక్టవుతారని నమ్మేవాళ్లలో నేనూ ఒకడిని. కథ ఎంచుకోవడంలో ఈ పాయింట్ కూడా ఉండి ఉండొచ్చు.
సినిమా విషయంలో అన్న నాకు చెప్పింది ఒక్కటే. పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు. నువ్వు హీరోగా నిలబడాలంటే, ప్రతీదీ దగ్గరుండి చూసుకోవాలని. ఏ విషయంలోనూ తను సపోర్ట్ ఇవ్వలేదు. చివరిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్ విన్నాక, నాకోసం ఎంత తపన పడి ఉంటాడన్న విషయం అర్థమైంది.
ఇక్కడ పరిస్థితులు ప్రాక్టికల్‌గా నాకూ కొంత తెలుసు. విజయ్ హీరో అవ్వడానికి పదేళ్లపాటు ఎంత కష్టపడ్డాడో నేను స్వయంగా చూశాను.
80వ దశకంనాటి పీరియాడిక్ స్టోరీ కనుక, అప్పటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం బలంగానే చేశాం. డబ్బున్న అమ్మాయికి నిరుపేద కుర్రాడికి మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఓ దొరసాని ప్రేమను ఇళ్లకు సున్నం వేసే రాజు అనే కుర్రాడు ఎలా దక్కించుకున్నాడు అన్నది ఇంటెన్స్‌గా చెప్పాం. ప్యూర్ లవ్ స్టోరీ. శివాత్మిక పెర్ఫార్మెన్స్ అద్భుతం. చిత్రమేమంటే -ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా తక్కువ. అందులోనూ పాత్రలు దూరం దూరంగానే ఉంటాయి.
దర్శకుడు మహేంద్ర సుదీర్ఘంగా కథ చెప్పినప్పుడు ఇంటెన్షన్ బాగా అర్థమైంది. ప్రతీదీ డీటెయిల్డ్‌గా చెప్పాడు. తను నేరేట్ చేస్తుంటే, ఇంకా వినాలనిపించింది. ఆ టైంలో తెలంగాణ ప్రాంత పరిస్థితులు, గడీలు, దొరతనం చక్కగా చూపించాడు. ఆర్‌ఆర్, కెమెరా వర్క్ టెక్నికాలిటీ ఈ సినిమాకు పెద్ద ప్లస్.
విజయ్ సినిమా చూశాక మంచి ప్రయత్నం అంటూ మెచ్చుకున్నాడు. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగే ఫ్లాట్‌ఫాం అంటూనే, కొన్ని సన్నివేశాల్లో గొప్పగా నటించానని అన్నాడు.
దొరసానిపైనే పూర్తి ఫోకస్‌తో ఉన్నా. మరో ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా.