ఏయ్ జూనియర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు రవికుమార్ పొన్నగంటి తెరకెక్కిస్తోన్న ‘ఏయ్ జూనియర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. వ్యాంకిష్ మీడియాపై షేక్ గౌస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సందేశంతో కూడిన ప్రేమకథా చిత్రం తప్పక విజయం సాధించాలని ఈ సందర్భంగా పోచారం ఆకాంక్షించారు. నిర్మాత షేక్ గౌస్ మాట్లాడుతూ -ఆగస్టు తొలివారంలో సినిమా విడుదలకు వీలుగా శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత ఉందని, టీం మొత్తం కష్టపడి సినిమా తెరకెక్కించిందన్నారు. దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ -కాలేజ్ బ్య్రాక్‌డ్రాప్‌లో ఏమాత్రం అసభ్యతకు తావులేని చక్కని టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించామన్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ ఈ చిత్రానికి అదనపు అస్సెట్ అన్నారు.