నేనే కేడీ నెం-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శంభో శంకర’ చిత్రంతో హీరో అయిన కమెడియన్ షకలక శంకర్ తాజా చిత్రం -నేనే కేడీ నెం 1. ఆర్‌ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎండి రౌఫ్ సమర్పణలో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్. 26న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో నిర్మాత సి కళ్యాణ్ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కళ్యాణ్ మాట్లాడుతూ -ట్రైలర్ బావుంది. చక్కటి కథాంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. షకలక శంకర్‌కి గుర్తింపు ఉంది కనుక, సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయన్న నమ్మకముంది. మంచి కంటెంట్‌తో బడ్జెట్ పెరగకుండా సినిమాలు తీయాలి. చిన్న చిత్రాల నిర్మాతల కోసం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో తుది నిర్ణయానికొస్తాం. ఈ సినిమా లాభాలు ఆర్జించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శక నిర్మాత జాని మాట్లాడుతూ -మంచి ఎంటర్‌టైన్‌తో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ నేనే కేడి నెం 1. యువత పెడతోవ పట్టడానికి కారణం తల్లిదండ్రులనే అంశాన్ని చూపిస్తున్నాం. తల్లిదండ్రులతో కలిసి యవత చూడాల్సిన సినిమా. షకలక శంకర్ పాత్ర త్రీ షేడ్స్‌తో ఉంటుంది. హీరోయిన్ ముస్కాన్ అందం, నికిషా పటేల్, పృథ్వీ పాత్రలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అన్నారు.