సెప్టెంబర్ 5న.. 24 గంటల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్లీ మొదలైంది, బొమ్మనా బ్రదర్స్.. చందనా సిస్టర్స్, ఢమరుకం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. హీరో సత్యదేవ్. నిర్మాత శ్రీనివాస్ కానూరు. పోస్ట్ ప్రొడక్షన్స్‌లోవున్న చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ -దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డితో పని చేయడం హ్యాపీగా ఉంది. దీని తరువాత ఇదే దర్శకుడితో మరో సినిమా చేయడానికీ ఏర్పాట్లు చేసుకుంటున్నా అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మంచి కంటెంట్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా చేసిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈషా రెబ్బా అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది.