వీళ్లే.. వైఫ్.ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడుచేపల కథలో టెంప్ట్ రవిగా నవ్వించిన అభిషేక్‌రెడ్డి, సాక్షి నిదియా జంటగా దర్శకుడు జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ తెరకెక్కిస్తోన్న చిత్రం -వైఫ్,ఐ. నైఫ్ బెటర్ దేన్ వైఫ్ అన్నది బాటమ్ క్యాప్షన్. సినిమాకు జి చరితారెడ్డి నిర్మాత. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సందర్భంలో దర్శకుడు కళ్యాణ్ మాట్లాడుతూ -‘అంతం’ తరువాత మంచి కథ కోసమే ఇంతకాలం ఆగాను. సొసైటీలోని ఓ ఆసక్తికర అంశాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. భార్యాభర్తల మధ్య అన్ని రసాల కలగలుపుగా సృష్టించిన రొమాంటిక్ కామెడీ ఇది. 70శాతం షూటింగ్ పూరె్తైంది అన్నారు. నిర్మాత చరితారెడ్డి మాట్లాడుతూ -కళ్యాణ్ చెప్పిన కథ నచ్చి చేయాలనుకున్నా. వైవాహిక జీవితాలు నాశనమైపోతున్న రోజుల్లో -సమస్యకు పరిష్కారం చూపే అద్భుతమైన పాయింట్ ఇది. సినిమాకు మంచి టీం సెట్టవ్వడంతో -ఫలితంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.