మిస్టర్ కేకే వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాన్ విక్రమ్ హీరోగా అక్షరహాసన్, అభిహాసన్ కీలక పాత్రల్లో రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -మిస్టర్ కేకే. జూలై 19న విడుదలవుతున్న చిత్రాన్ని -కిల్లర్ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న నిర్మాతలు టి నరేష్‌కుమార్, టి శ్రీ్ధర్‌లు సంయుక్తంగా టి అంజయ్య సమర్పణలో తెలుగులో విడుదల చేస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని సెల్వ తెరకెక్కించాడు. ఈ సందర్భంలో నిర్మాతలు మాట్లాడుతూ కిల్లర్ తరువాత పారిజాత మూవీ క్రియేషన్స్‌లో విడుదలవుతున్న మరో సెనే్సషన్ మిస్టర్ కేకే అన్నారు. మంచి చిత్రాలు చేయాలనే ప్రయత్నానికి తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు బలంగా ఉన్నాయన్నారు. సినిమా ట్రైలర్‌లో విక్రమ్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా కూడా విజువల్ గ్రాండియర్‌గా ఉంటుందన్నారు. అక్షర హాసన్ పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌వున్న పాత్ర చేసిందన్నారు. జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని, సమర్ధుడైన కమాండర్‌గా విక్రమ్ యాక్షన్ ప్రేక్షకుల్ని సంతృప్తిపర్చగలదన్న నమ్మకం ఉందన్నారు. త్వరలోనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు చెప్పారు.