ఇస్మార్ట్ నిలిచిపోతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీ, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి నిర్మాతలుగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు గుంటూరు వివిఐటి కాలేజీలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ మాట్లాడుతూ- మణిశర్మగారు మా సినిమాకు పెద్ద పిల్లర్. అడగ్గానే ఐదు పాటలు ఇచ్చారు. మంచి ఆల్బమ్ అని పొగుడుతున్నారు. రామ్‌తో కలిసి తొలిసారి పనిచేశాను. తనలో ఎనర్జీ అన్‌లిమిటెడ్. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఎనర్జీ వుంది. ఇస్మార్ట్ శంకర్ మైండ్‌లో నిలిచిపోతాడు. రామ్ మాట్లాడిన తెలంగాణ యాక్సెంట్ సినిమాకే హైలెట్. సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అన్నారు. రామ్ మాట్లాడుతూ- ఈ సినిమాను ప్రేక్షకులు రెండు గంటలు చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఎలా పూర్తిచేశానో నాకే తెలియడంలేదు. సినిమా చేసిన ఆరు నెలల కాలం నా లైఫ్‌లోనే బెస్ట్ టైమ్. మణిశర్మగారి సంగీతం అద్భుతం. సినిమాలో ప్రతి ఎలిమెంట్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అన్నారు. నిర్మాత ఛార్మి కౌర్ మాట్లాడుతూ- సినిమా ఫస్ట్ కాపీ చూశాం. కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. యూనిట్ అందరికీ అదే నమ్మకం ఏర్పడింది. రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిధి, నభా వారి పాత్రల్లో చక్కగా నటించారు. పూరీతో రామ్ మళ్లీ పనిచేయాలని అందరూ కోరుకునేలా సినిమా ఉంటుంది అన్నారు. నిధి అగర్వాల్ మాట్లాడుతూ- నేను పూరిగారితో కలిసి పని చేయాలని ఎదురుచూశాను. కానీ తక్కువ సమయంలోనే ఆయనతో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. రామ్‌తో పనిచేయడం హ్యాపీ. తను మంచి డాన్సర్. సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.