పండుగాడు ఫొటోతీస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలీ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం -పండుగాడి ఫొటో స్టూడియో. గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాలమార్క్ కామెడీ చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకున్న చిత్రం టీజర్‌కు దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -ఆలీ కామెడీని నాతోసహా చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ఈ సినిమాతో ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలవుతోంది. కథ కోసం రెండేళ్లు కష్టపడిన దర్శకుడు దిలీప్‌రాజా, ఆలీని స్టార్‌హీరోలా చూపించారు. జంధ్యాల మార్క్ కామెడీతో ఈ సినిమా అందరినీ అలరించటం ఖాయం అన్నారు. చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ -చిత్రమైన కథతో సినిమా తెరకెక్కింది. ఆలీ ఎవరికి ఫొటో తీస్తే వాళ్లకు పెళ్లయిపోతుంది. చిత్రంలో పాత్రలు విలక్షణంగానూ, నటీనటుల పేర్లు వైవిధ్యంగానూ ఉంటాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా సినిమాను తెరకెక్కించాం. కొత్త ఆర్టిస్టులు సందీప్ రాజా, టీనా చౌదరి విలక్షణ పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు యాజమాన్య మంచి బాణీలు అందించారు. సినిమా ప్రీరిలీజ్‌ను తెనాలిలో ఈనెల 21న నిర్వహించనున్నాం అన్నారు.