రఫ్ అండ్ టఫ్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిసారి ఇంత మాస్ పాత్రలో బోల్డ్‌గా కనిపిస్తానంటోంది హీరోయిన్ నభానటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, రవిబాబు దర్శకత్వంలో ఇదిగో సినిమా చేసింది. ప్రస్తుతం వరుస చాన్స్‌లతో దూసుకుపోతున్న నభ, తాజాగా రామ్‌తో జోడికట్టిన చిత్రం -ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 18న విడుదలవుతోన్న సందర్భంలో మీడియాతో ముచ్చటించింది.
సినిమాలో సివిల్ ఇంజనీర్‌ని. ఎక్కువమంది మగాళ్లతో పనిచేయాలి, గట్టిగా మాట్లాడాలి. దానికితోడు కాలేజ్‌లోనూ గడుసమ్మాయిని. మగాళ్లను ఆడుకునే టైపు. మొత్తంగా -రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తా. రామ్‌తో పోటీపడి నటించా.
రామ్ నిజంగా చాలా ఇస్మార్ట్. సెట్స్‌లో కూల్‌గా ఉంటాడు. సీన్స్‌లో చూపించే ఎనర్జీ వేరు. డౌట్‌లేదు, ఇస్మార్ట్ శంకర్ అదరగొడతాడు. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా తెలంగాణ స్లాంగ్‌లో రామ్ డైలాగ్స్, లుక్ కొత్తగా ఉంటాయి.
పూరి జగన్నాథ్‌తో పనిచేయడం హ్యాపీ. సెట్స్‌లో వెరీ పాజిటివ్. ఆయన సినిమాలో హీరోయిన్లు ఎలా ఉంటారో చెప్పక్కర్లేదు. సెట్స్‌లోనూ అలాగే ఉండేలా ప్రోత్సహిస్తారు.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఎవరి ఇంపార్టెన్స్ వారికే. నేనేమో రఫ్. నిధి వెరీ కూల్ టైపు. అయితే, ఇద్దరి కాంబినేషన్‌లో సీన్స్ లేవు. ఒక సాంగ్ మాత్రమే ఉంది.
ప్రస్తుతం రవితేజతో డిస్కోరాజా చేస్తున్నా. దాంతోపాటు తెలుగులో రెండు సినిమాలకు కథా చర్చలు జరుగుతున్నాయి. ఓ తమిళ సినిమాకూ చర్చలు సాగుతున్నాయి.