ఓ బేబీ నచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ముఖ్యపాత్రలో బివి నందినిరెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. నిర్మాత సునీత మాట్లాడుతూ -ఊహించిన విజయం అందడం ఆనందంగా ఉంది. చాలా కొరియన్ చిత్రాల కాపీలు వచ్చాయ. కానీ, రీమేక్ ఇదే ఫస్ట్ టైమ్. సినిమాకు నలుగురు నిర్మాతలైనా, రథసారథి మాత్రం సురేష్‌బాబు. ప్రతి విషయంలో ఆయన ప్లాన్ బాగా వర్కవుటైంది. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది. ఇప్పటికే మూడు కథలు ఫైనల్ చేశాం. అక్టోబర్‌లో సినిమాను మొదలుపెట్టే అవకాశాలున్నాయి అన్నారు. మరో నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ -ఓ బేబీ తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటికీ కలక్షన్స్ స్టడీగా ఉన్నాయి. సినిమాను హిందీలోనూ రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. దాంతోపాటు చైనా భాషలో డబ్ చేసి విడుదల చేయనున్నామన్నారు.