వనవాసం హిట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌రాజ్ శంకరపూడి, శశికాంత్, శ్రావ్య, శృతి హీరో హీరోయిన్లుగా భరత్ పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -వనవాసం. తాజాగా నిర్వహించిన సినిమా ఆడియో ఫంక్షన్‌కు అల్లరి నరేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాజ్ కందుకూరి హాజరయ్యారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ అవుదామని వచ్చిన సంజయ్‌కుమార్ నిర్మాత అయ్యారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆయన ఫ్రెండ్ నిర్మిస్తూ చనిపోవడంతో-ఆ బాధ్యతను సంజయ్‌కుమార్ తీసుకున్నారు. వనవాసం విజయం సాధించి మంచి పేరు రావాలి అన్నారు. నిర్మాత సంజయ్‌కుమార్ మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమైన అల్లరి నరేష్, ఇప్పుడు మా చిత్రాన్ని ప్రోత్సహించడానికి రావడం హ్యాపీగా ఉంది అన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ -ఈ మధ్య చిన్న సినిమాలకు మంచి పేరొస్తుంది. కంటెంట్ బావుంటే చాలు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వనవాసం ట్రైలర్ బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ మంచి బాణీలిచ్చారు. సినిమా విజయవంతమవ్వాలని ఆశిస్తున్నా అన్నారు. దర్శకుడు భరత్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించామని, ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత సహకరించారన్నారు.