స్టార్స్ కాదు.. స్క్రిప్ట్ ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్కోరాజా తరువాత..?
సినిమా కథ. ఇది ఫీలై రాసేదే తప్ప, ఏదో రాయాలని రాసేది కాదు అంటున్నాడు
రైటర్ లక్ష్మీభూపాల్. యాక్సిడెంటల్‌గా రైటరయ్యానని చెబుతున్న ఈ రచయిత, చేసినవి
తక్కువ సినిమాలే అయినా తనదైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. లక్ష్మీభూపాల్ చేసిన తాజా చిత్రం -ఓ బేబీ. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి తెరకెక్కించిన చిత్రం. సినిమా హిట్ టాక్‌తో
నడుస్తోన్న సందర్భంలో రచయితగా తన అనుభవాలు పంచుకున్నాడు లక్ష్మీభూపాల్.

చాలా సినిమాలకే స్క్రిప్ట్ అందించా. కానీ, ఏ సినిమా ఇవ్వని సంతృప్తి ఓ బేబీతో దొరికింది. ఏదో గొప్పగా రాసేశానని చెప్పనుగానీ, నిజ జీవితంలో మనకెదురయ్యే ఫీలింగ్స్‌నే రాశాను. ముఖ్యంగా చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన మాటల్లో చాలావాటిని అలాగే రాసేశా. ఒకరకంగా ఆమే నాతో అలా రాయించిందేమో.
మార్పులు చేశాం..
ఇరి కొరియాలో పుట్టిన కథ. తరువాత చాలా భాషల్లో రీమేక్ అయ్యింది. దాన్ని మన తెలుగు నేటివిటీకి తెచ్చే విషయంలో చాలా మార్పులు చేశాం. ఒరిజినల్ వర్షన్ చాలా రఫ్‌గా ఉంటుంది. మన తెలుగు వాతావరణం, ఆ వయసులో ఉన్నవారి మనస్వత్వాలు.. ఆ భాష.. ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తపడ్డాం.
స్టార్ హీరోలతో..
నేనిప్పటి వరకూ 50కి పైగా సినిమాలకు రాసినా, ఏ స్టార్ హీరోకీ రాయలేదు. కారణం కూడా తెలీదు. రెండు మూడు అవకాశాలు రాకపోలేదు. కాని నాకు నచ్చకో.. సెట్‌కాకో రాయలేదు. ఎన్ని చిన్ని సినిమాలకు రాసినా పరిస్థితి ఇలాగే ఉంటుంది.
స్క్రిప్ట్ ముఖ్యం..
ఏ సినిమాకైనా స్క్రిప్ట్ వర్క్ చాలా ముఖ్యం. ఎందుకంటే కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే.. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే సినిమా ఆడుతుంది. సరైన స్క్రిప్ట్‌లేకుంటే, స్టార్ హీరోలు, డైరెక్టర్లున్నా సినిమా ఆడదు. ఇది ఇండియన్ సినిమా విషయంలో మారని అంశం. ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చినా దాన్ని మార్చలేరు.
నా జర్నీ..
గతంలోనే నేను మీడియాలో పని చేశాను. మిలీనియం పీరియడ్‌లో మా ఏలూరు వెళ్లిపోయా. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల 2004లో మళ్లీ వచ్చాను. అప్పుడే మళ్లీ మీడియాలో చేరాలని అనుకున్నా. కానీ అప్పుడు కమెడియన్ లక్ష్మీపతి ‘సోగ్గాడే’ సినిమాకు రైటర్ కావాలని అవకాశం ఇప్పించారు. అప్పటికే ఆ సినిమాకు ఓ రైటర్ సగం రాశాడు. ఆ మిగతా సగం నేను పూర్తి చేశా. నేను రైటర్‌ని కావాలని రాలేదు. యడ్సిడెంటల్‌గా రైటర్‌నయ్యా.
అవకాశాలు వస్తున్నాయి..
ప్రస్తుతం ఓ బేబీ తరువాత ఐదారు అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం మూడు స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. అందులో తేజతో ఒకటి, నందినిరెడ్డితో ఒకటి ఉంటుంది. త్వరలోనే దాని గురించి ప్రకటిస్తా.

-శ్రీనివాస్ ఆర్ రావ్