100దాటి 369కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటిస్తోన్న చిత్రం గుణ 369. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జి మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. కార్యక్రమంలో దర్శకుడు బోయపటి శ్రీను, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- కార్తికేయ పేరు కంటే ఆర్‌ఎక్స్ 100 హీరోగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. టీజర్ అద్భుతంగా వుంది. దర్శకుడు అర్జున్ కడియాల బాగా కష్టపడే మనస్తత్వంవున్న దర్శకుడు. తప్పకుండా గుణ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ- నటనపరంగా ఈజ్ వున్న హీరో కార్తికేయ. అర్జున్ జంధ్యాల నా దగ్గర భద్ర సినిమా నుండి పనిచేస్తున్నాడు. ఏదైనా పని చెబితే దాన్ని చేసేవరకూ అక్కడినుండి కదలడు. చాలా కమిట్‌మెంట్ వున్న దర్శకుడు. తప్పకుండా ఈ సినిమాతో మంచి పేరొస్తుంది అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ- నిజ జీవితాలకు దగ్గరగా వున్న కథ. మన పక్కింటి అబ్బాయి తరహాలో పాత్రలుంటాయి. ఈ సినిమాతో మంచి హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ షూటింగ్ పూర్తయింది. మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 2న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.