అదొక కళాత్మక నగ్నత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రైలర్‌తోనే దుమారం రేపింది ‘ఆమె’. న్యూడ్ సీన్ చేసి షాకిచ్చిన ఆమె ఎవరో కాదు -అమలాపాల్. తాజాగా ఆమె చేసిన తమిళ సినిమా ‘అడై’ తెలుగులోనూ విడుదలవుతోంది. 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాకు సంబంధించి అమలాపాల్ చెప్పిన విశేషాలు.
తెలుగులో ఐదు సినిమాలు చేశాను. ఇటీవలి కాలంలో ఆఫర్లు వస్తున్నా, కథలు నచ్చక నో చెప్పేస్తున్నా. ఇన్నోవేటివ్ కానె్సప్ట్స్‌తోనే తెలుగు సినిమా చేయాలన్న ఆలోచన నాది. కీర్తిసురేష్ చేసిన ‘మహానటి’లాంటి అభినయానికి ఆస్కారమున్న పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తమిళ పరిశ్రమపైనే ఫోకస్‌తో ఉన్నా. ఒక మలయాళ సినిమా చేస్తున్నా.
ఏ భాషా చిత్రాల్లోనైనా నవ్యమైన ఇతివృత్తం కోసమే ఎదురు చూస్తున్నా. లేడీ ఓరియంటెడ్ కథలు, మహిళా సాధికారతను చర్చించే ఇతివృత్తాలు వస్తున్నాయి. వాటికి భిన్నంగా మహిళల చుట్టూ పరిభ్రమించే వినూత్న కథలు చేయాలనుంది.
కెరీర్ ఆరంభంలో కమర్షియల్ సినిమాలు చేశాను. కొద్దికాలంగా నా ప్రయాణంలో మార్పొచ్చింది. నటిగా పరిణితి సాధించాను. వినూత్న కథలపై తపన పెరిగింది. డబ్బు సంపాదానకంటే, గుర్తుండిపోయే సినిమాలు చేయాలనే సంకల్పం ఎక్కువైంది. అలాగని కమర్షియల్‌కు వ్యతిరేకిని కాను.
అదైలో కథపరంగా నగ్నత్వం అంశం ఉంటుంది. హద్దు మీరకుండా ఆ సీన్ చేయాలనుకున్నా. అశ్లీలతకు చోటులేకుండా, కళాత్మకంగా తెరకెక్కించాం. కథలో భాగంగానే ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని చూస్తారు. సినిమాలో కామిని అనే యువతి పాత్రలో కనిపిస్తా. కొంచెం స్వార్థం ఎక్కువ. భిన్న పార్శ్వాలున్న పాత్రను పోషంచడం సవాలుగా తీసుకున్నా.
కొనే్నళ్ల క్రితం వరకూ నేనూ కామినిలాంటి దృక్పథంతో ఉండేదాన్ని. కానీ జీవితం నేర్పిన పాఠాలతోపాటు, యోగాతో మార్పొచ్చింది. మనసుకు ప్రశాంతత చేకూరింది.
హీరోయిన్‌ను గ్లామర్ కోణంలో చూసే 80ల కాలంనాటి భావజాలం క్రమంగా తగ్గుతోంది. నేటి సమాజంలో మహిళలు శక్తివంతమవుతున్నారు. ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తున్నారు. వారి చుట్టూవున్న కథల్ని చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగులో మంచి చాన్స్ కోసం చూస్తున్నా.
రాజవౌళి డైరెక్షన్‌లో సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ప్రస్తుతం తమిళంలో ‘కడావర్’ చేస్తున్నాను. ఇదొక ఫొరెన్సిక్ థ్రిల్లర్. కేరళకు చెందిన లెజెండరీ ఫొరెన్సిక్ సర్జన్ ఉమాదత్తన్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. నేనే నిర్మాతను. తమిళ, తెలుగు భాషల్లో నిర్మించబోతున్నాను.