ఫోకస్

అడ్డుకుని తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీఫ్ ఫెస్టివల్‌ను ఎక్కడా జరగనీయం. దీనిని ఖచ్చితంగా అడ్డుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు తమ భవిష్యత్తుకోసం ఆలోచన చేయాలి. విశ్వవిద్యాలయాల్లో వారికి ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాటం చేయాలి. అలా చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామనడం సమంజసం కాదు. దీని వెనకాల ముస్లిం, క్రిస్టియన్ సంస్థలు అండగా నిలబడుతున్నాయి. అనాదిగా సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అనాగిరికత వల్ల లోగడ కొన్ని కులాలవారు ఈ మాంసాన్ని తిని ఉంటారు. ఆ రుగ్మగతలు పొగొట్టాల్సిన అవసరం ఉంది. విడగొట్టే ఆలోచనను విడిచిపెట్టాలి. విద్యార్థులు ఏమి సాధించాలని బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. సమాజంలో మార్పులు వచ్చాయి. ఆర్థిక స్థితిగతులు మారాయి. నాగరిక సమాజంలో ఉన్నాం. అనాగరికమైన వాటికి స్వస్తి పలకాలి. వెనకటికి తిన్నారు కాబట్టి ఇప్పుడూ తింటాం అనడం మంచిది కాదు.
సమాజంలో భేదాలు పోవాలన్న భావనతోనే నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అట్టడుగున ఉన్నవారిని, సమాజానికి దూరంగా నెట్టివేయబడిన వారినీ కలుపుకుని పోవాలన్నదే అంబేద్కర్ ఆశయం. ఆ దిశగా అందరూ అడుగులు వేస్తున్నారు, ఇంకా ప్రతి ఒక్కరూ ఆ విధంగా కృషి చేయాలి. కానీ కొంతమంది విద్యార్థులు, కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు రాజకీయ లబ్దికోసం యూనివర్సిటీలో బహిరంగంగా బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని ప్రకటించారు. బీఫ్ ఫెస్టివల్‌ను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనీయం.
అక్కడే గోవుపాల పండుగను నిర్వహిస్తాం. అన్ని ఆలయాల్లో గోపూజలు నిర్వహిస్తాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామాల్లో పొలం పనులు చేస్తుంటే, మరి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ తమ పిల్లలు హైదరాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉత్తీర్ణులై వస్తారన్న కోటి ఆశలతో ఉంటారు. కానీ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలకు భిన్నంగా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరచడం భావ్యం కాదు. విశ్వవిద్యాలయంలోనూ 95 శాతం మంది విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్నారు. అనేక విద్యార్థి సంఘాలూ దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

- వై. భానుప్రకాష్, రాష్ట్ర కన్వీనర్, బజరంగ్‌దళ్