విలన్‌గా దర్శకుడు సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బ్రహ్మోత్సవం’ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత మహేష్‌బాబు నటించే చిత్రానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందనుంది. ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ చిత్రం మేలో ప్రారంభం కానుంది. సామాజిక కథాంశం నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో మహేష్‌బాబుకు విలన్‌గా ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య నటిస్తాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాత్ర కోసం ఆయన్ను ఓకె చేశారట. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం వుంది.