ఆ వర్కౌట్స్ వర్కౌటైనట్టే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా సినిమాకూ హాట్ డోస్ పెంచుతోంది రకుల్‌ప్రీత్. మన్మధుడు 2లో రకుల్ హాట్ షోపై వార్తలు వైరల్ అయ్యాయ. ‘సిగరెట్’ సీన్ డిస్కషన్ మరింత హీట్ పెంచింది. మొన్న బాలీవుడ్‌లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’కి మించి మన్మధుడు 2లో హాట్‌నెస్ పెంచడానికి కారణం -బాలీవుడ్‌లో తిష్టవేయడానికే కావొచ్చు. నటనలోనే కాదు, గ్లామర్‌పరంగానూ స్వేచ్ఛ తీసుకుంటానంటూ రకులే అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చింది. మన్మధుడు 2 టీజర్, పోస్టర్లలో రకుల్ హాట్‌నెస్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. ‘దే దే ప్యార్ దే’ తరువాత బాలీవుడ్ నుంచి కాల్స్ వస్తుండటంతో -టాలీవుడ్ స్క్రీన్‌పైనా బాలీవుడ్ డోస్ ఇవ్వాలనే రకుల్ నిర్ణయించుకుందన్న కథనాలు లేకపోలేదు. మరోపక్క -సౌత్‌పైనా ఫోకస్ పెంచుతోంది. గ్లామర్ డోస్‌తో తన ట్రాక్‌ను పదిలం చేసుకోవాలన్న కానె్సప్ట్‌తో ముందుకెళ్తోందన్నది పరిశీలకుల మాట. అందుకే గ్లామర్ విషయంలో గ్రామర్‌కు హద్దులు చెరిపేస్తోందని అంటున్నారు.
అయతే, హాట్ బ్యూటీ రకుల్‌ప్రీత్ స్కీం వర్కౌటైనట్టే కనిపిస్తోంది. కొంతకాలం ఆగిపోయి మళ్లీ మొదలవుతున్న శంకర్ సినిమా -్భరతీయుడు 2లో చాన్స్ దక్కించుకున్నట్టు తాజా సమాచారం. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెస్తున్న ప్రాజెక్టులో మెయిన్ హీరోయిన్ రోల్ కాజల్ దక్కించుకుంది. సెకెండ్ హీరోయిన్‌గా టీంలోకి రకుల్ చేరినట్టు సమాచారం. భారతీయుడులో కమల్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోవడం తెలిసిందే. అయితే సీక్వెల్ ప్రాజెక్టులో మాత్రం కమల్ -సీనియర్ ఇండియన్ పాత్రే పోషిస్తాడట. మరో పాత్ర కోసం సిద్ధార్థ్‌ను ఎంపిక చేసుకున్నారు. సిద్దార్థ్‌కు పెయిర్‌గా రకుల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రకుల్ మన్మథుడు 2తో ఆగస్టు 9న థియేటర్లకు వస్తుంటే, నితిన్-యేలేటి కాంబినేషన్‌లో రానున్న మరో సినిమాకు సైన్ చేసింది. సౌత్‌లో పట్టుకోసం ఇప్పుడు భారతీయుడు 2లో చాన్స్ దక్కించుకున్న రకుల్ -ఈ గ్రాఫ్‌తో బాలీవుడ్‌కు ఎగిరినా ఎగరొచ్చు.