హథీరామ్ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాట్రిక్ విజయంతో మంచి జోరుమీదున్నాడు అక్కినేని అందగాడు నాగార్జున. ముఖ్యంగా ‘ఊపిరి’ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. దాంతో ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా తరువాత నాగార్జున నటించిన భక్తిరస చిత్రం కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానున్నదట. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడు హాధీరామ్ బాబాజీ జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇప్పటికే ‘ఓం నమో వేంకటేశాయ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ప్రస్తుతం కేరళ, కర్నాటకలోని కొన్ని ప్రదేశాల్లో షూటింగ్‌కు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.