అభిమానులకు శాతకర్ణి అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన కథాంశంతో తాను నటిస్తున్న వందో సినిమాను తెలుగువారికి, తన అభిమానులకు అంకితమిస్తున్నానని హీరో బాలకృష్ణ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగువాడైన శాతకర్ణి గురించి అందరికీ తెలియచేయాలన్న లక్ష్యంతో తాను ఈ కథను ఎంచుకున్నానని, తెలుగువారంతా గర్వించదగ్గ నాయకుడు శాతకర్ణి అని ఆయన అన్నారు. నాన్న ఎన్టీఆర్ తన నుదుట తిలకం దిద్ది సినిమాల్లోకి ఆహ్వానించారని, అందుకే కొత్తకొత్త పాత్రలతో తెలుగువారిని ఆనందింప చేస్తున్నానని అన్నారు. కొత్తదనంకోసం తన తండ్రి ఎన్టీఆర్ పరితపించేవారని, తనూ అదే పంథాలో ఆలోచించి ఈ కథాంశాన్ని ఎంచుకున్నానని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ, వందో సినిమా అంటేనే గొప్పగా ఉంటుందని, దానికి శాతకర్ణి కథను ఎంచుకోవడమే తొలి విజయం సాధించినట్లయిందని, బాలయ్య కెరీర్‌లో అపురూప చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. క్రిష్ డైరెక్టన్ అంటేనే విజయం తథ్యమని, చారిత్రక అంశాలపై ఆయనకున్న పట్టు అటువంటిదని అన్నారు. ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ ఆడాలని కోరుకుంటున్నానన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ, బాలకృష్ణ వందో సినిమాకు మొట్టమొదటి తెలుగు చక్రవర్తి కథనెంచుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. 33 రాజ్యాలను జయించిన చక్రవర్తి కథ ఇదని, మనం చేసుకునే ఉగాది పచ్చడి సంప్రదాయం గౌతమీపుత్ర శాతకర్ణితోనే ప్రారంభం అయిందని. బాలయ్య ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

చిత్రం ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్