స్నేహం కోసం రాక్షస సంహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్, శైలజ లీడ్‌రోల్స్‌తో దర్శకుడు జి మురళి తెరకెక్కిస్తోన్న చిత్రం -మేరా దోస్త్. నిర్మాత పి వీరారెడ్డి. వి సాయిరెడ్డి సంగీతం సమకూర్చిన చిత్ర ఆడియోను తెలంగాణ వాటర్ బోర్డ్ చైర్మన్ వి ప్రకాశ్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి ప్రకాశ్ మాట్లాడుతూ -సినిమా అంటే చిన్నప్పటినుంచి ఆసక్తి. అయితే అనుకోకుండా పొలిటికల్ ఫీల్డ్‌కి వెళ్లాను. తరువాత అల్లాణి శ్రీ్ధర్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆ తరుణంలో తెలంగాణ ఉద్యమం కారణంగా సినిమాకు దూరమయ్యాను. ఎప్పటికైనా మంచి సినిమా తీయాలని ఉంది. ‘మేరాదోస్త్’ విషయానికొస్తే వీరారెడ్డి నాకు 20 ఏళ్లుగా పరిచయం. డబ్బ సంపాదన కంటే సినిమా మీద ఫ్యాషన్‌తో వచ్చిన వ్యక్తి. అలాగే దర్శకుడికీ సినిమా రంగంపట్ల మంచి అవగాహన, అనుభవముంది. పాటలు బావున్నాయి. సినిమా సక్సెస్ సాధించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అన్నారు. డిజిక్వెస్ట్ బసిరెడ్డి మాట్లాడుతూ -దర్శకుడు మురళి కష్టపడే వ్యక్తి. ఈ సినిమాతో మంచి దర్శకుడిగా ఎదగాలి అన్నారు. నిర్మాత పి వీరారెడ్డి మాట్లాడుతూ -దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అందరికీ నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. దర్శకుడు జి మురళి మాట్లాడుతూ -డైనమిక్ లాంటి అమ్మాయి ఒక బలహీనుడిని ప్రేమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఆ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకెళ్తాడు. అప్పుడు ఆ బలహీనుడి మిత్రుడైన హీరో రాక్షస సంహారం కావించి, అమ్మాయిని ఎలా రక్షించాడన్నదే కథాంశం. నిర్మాత సహకారంతో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం అన్నారు.