పాత్ర ముఖ్యం.. మైలేజ్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి శేష్ హీరోగా పీవీపీ బ్యానర్‌పై కొత్త దర్శకుడు వెంకట్ రామ్‌జీ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ -ఎవరు? పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అనె్న నిర్మాతలు. రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర
కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 15న సినిమా థియేటర్లకు వస్తోన్న నేపథ్యంలో -మీడియాతో
రెజీనా కాసాండ్రా ముచ్చట్లు.

సమీర పాత్రను -దర్శకుడు రాంజీ వివరిస్తున్నపుడే నాకు సినిమా కనిపించింది. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేని గంభీరమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. వెంటనే చేస్తానని చెప్పేశాను. చిత్రమేమంటే -షూటింగ్‌కు వచ్చినపుడు ఈ పాత్రను మిమ్మల్నే ఊహించుకుని రాశానని చెప్పాడు. మరింత హ్యాపీ అనిపించింది. అ, సెవెన్‌లాంటి చిత్రాల్లో ఇంటెన్స్ క్యారెక్టర్లు చేశానుగానీ, ఇది మాత్రం ఆ కోణంలో ఫుల్‌మీల్స్.
పాత్రపరంగా నేనొక -సీఈవో వైఫ్‌ని. గంభీరమైన మనస్తత్వం. ప్రశ్నలకూ ముక్తసరిగా సమాధానం చెప్పే నైజం. ఎంతో హార్డ్ వర్క్‌తో ఆ పొజిషన్‌కు వస్తుంది. అటువంటి సమీర లైఫ్‌లో ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ సంఘటన ఆమె జీవితంలో ఎలాంటి కంపనాలు సృష్టించింది? కేసును ఇనె్వస్టిగేట్ చేసిన విక్రమ్ వాసుదేవ్‌ని ఎలా డీల్ చేసిందన్నదే నా పాత్ర పరిథి.
దర్శకుడు రాంజీ నాకు కథ చెప్పినపుడు 80శాతం సినిమా నాపైనే ఉంటుందన్నాడు. (నవ్వేస్తూ) అయితే అది నన్ను కన్విన్స్ చేయడానికే. ఎవరు? ప్రాజెక్టులో నా పాత్ర నిడివి, స్క్రీన్‌ప్లే గమనం రెండూ సంతృప్తినిచ్చాయి.
ఈ కథ ‘బద్లా’కు దగ్గరగా ఉందని నాదగ్గర చాలామందే ప్రస్తావించారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే -సినిమా చూసిన తరువాత దానికి సమాధానం చూసినవాళ్లే చెప్పాలి. సిమిలారిటీస్ కూడా లేవన్నది నా అభిప్రాయం.
ఏ సినిమాలో ఎలాంటి పాత్ర చేసినా -కెరీర్ మైలేజ్ కోణంలో ఎప్పుడూ లెక్కలేసుకోను. పాత్ర నచ్చితే, ఆ పాత్రలోకి ఒదిగిపోయానా? లేదా? అందుకు ఇంకెలాంటి వర్కౌట్స్ చేయాలి అన్నదే ఆలోచిస్తా. అందుకు ‘అ’ చిత్రాన్నీ ఉదహరించొచ్చు. నేను పడిన కష్టానికి మంచి పేరొస్తే వెరీ హ్యాపీ. ‘అ’ చిత్రానికి నేషనల్ అవార్డు రావడం మరీ హ్యాపీ.
2011లో ఇండస్ట్రీకి వచ్చినపుడు -వాతావరణం నాకు పూర్తిగా కొత్త. ఏ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాలపై ఒపీనియన్స్ మీద ఆధారపడేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నా.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి కరెక్ట్ డెఫినిషన్స్ ఎక్కడా ఉండవు. ఎవరికి తోచినట్టు వాళ్లు తీసుకుంటామంతే. కాకపోతే, పాత్రపరంగా తలత్తే తప్పొప్పులను ఎప్పటికప్పుడు విశే్లషించుకుంటా. ఎందుకంటే -నన్ను నేను అర్థం చేసుకోవాలంటే అదే ముఖ్యం.
రాంజీ చాలా సున్నితమైన దర్శకుడు. పెద్ద దర్శకుల వద్ద పనిచేసినా, అనేక క్రాఫ్ట్‌పై అతనికి అవగాహన ఉన్నా ఒదిగివుండే తత్వం. అతనితో పని చేయడం చాలా హ్యాపీ అనిపించింది.
హీరో శేష్ మాత్రం -దాదాపుగా నన్ను టార్చర్ పెట్టాడు (నవ్వుతూ). అటు స్క్రీన్‌మీద పాత్రపరంగానూ, ఆఫ్ స్క్రీన్‌లోనూ నన్ను బాగా వేధించాడు. ఆ వేధింపులు ఫన్ రిలేషన్‌తో సాగటం.. ప్రాజెక్టు హాయిగా గడిచిపోయినట్టయ్యింది.
మంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అదీ, తెలుగులోనే కాదు. హిందీ, తమిళంనుంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. అవేంటో త్వరలోనే చెప్తా.

-‘వి’