వైకుంఠపురంలో.. నేను -నాన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్ -అల్లు అర్జున్ కాంబోలో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ సక్సెస్ కోసం బన్నీ చేస్తోన్న ఈ సినిమా అతనికి 19వ ప్రాజెక్టు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో సినిమా రూపొందుతోందని మొదలైనప్పుడే వినిపించింది. ‘వైకుంఠపురంలో..’ ‘నేను- నాన్న’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారన్న టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. అయితే ఈ రెంటిలో ఏదోక టైటిల్ ఖరారు చేస్తారా? వేరే టైటిల్ సెట్ చేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్‌పై వినిపిస్తోన్న అంచనాలకు తెరదించుతూ -ఆగస్టు 15న టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ప్రకటించాడు. సన్నాఫ్ సత్యమూర్తితో బన్నీకి ఓ యాక్షన్ క్లాసిక్‌ని ఇచ్చిన త్రివిక్రమ్ -మళ్లీ నాన్న కథకు ఎలాంటి టైటిల్ పెట్టి ఉంటాడోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సినిమా సంక్రాంతికి విడుదల కావొచ్చు.