కొరటాలతో ఎన్టీఆర్.. డౌటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లస్సో మైనస్సో.. ప్రతి శుక్రవారం ఓ దర్శకుడిదో, హీరోదో ఫేట్ మారిపోతుంది. ఇది సినిమా సెంటిమెంట్. అలాగే -పెద్ద హీరో చేస్తున్న ప్రాజెక్టులను బట్టి తరువాతి ప్రాజెక్టుల సీక్వెన్స్ మారిపోతుంది. ఇది కనిపించని సెంటిమెంట్. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ని కొమురం భీమ్‌గా జక్కన్న చెక్కుతున్నాడు. అంటే రాజవౌళి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. తరువాత ఎన్టీఆర్ ప్రాజెక్టు -కొరటాలతోనే అంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. సెట్స్‌పైకి వెళ్లనున్నట్టూ కథనాలు వచ్చేశాయ్. కానీ ఈ కాంబో ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే చాన్స్ లేదన్నది తాజా సమాచారం. జక్కన్న ప్రాజెక్టు వచ్చే మార్చికి పూరె్తైతే, తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఎన్టీఆన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే -కొరటాల ప్రాజెక్టు వెనక్కి వెళ్లడానికి కారణమని వినిపిస్తోంది. త్రివిక్రమ్- ఎన్టీఆర్ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి.. కేజీఎఫ్‌తో సెనే్సషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలూ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ రెండు సినిమాలు పూరె్తైన తరువాతగానీ కొరటాలతో ప్రాజెక్టు గురించి ఎన్టీఆర్ ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల తదుపరి ప్రాజెక్టుగా చిరంజీవితో టైఅప్ అయి ఉన్నాడు. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఇంకెన్ని ఈక్వెషన్స్ మారతాయో.