రూటు మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్. పుట్టుకతో మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌తోపాటుగా పాటలు పాడటం కూడా చేసేస్తోంది. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకు తాను దూరం అని చెప్పిన ఈ భామ ఇప్పుడు గ్లామర్ రూట్‌లోకి టర్న్ అయ్యేలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్న నిత్య, ఓవైపు కన్నడ సినిమాల్లో కూడా చేస్తోంది. పాత్ర బాగుంటే మొదటిదా, రెండోదా అని చూడకుండా నటించే నిత్యామీనన్ ఇకపై గ్లామర్ డోస్ పెంచడానికి నిర్ణయం తీసుకుందట. జనతాగ్యారేజ్ చిత్రంలో గ్లామర్‌గానే కనిపించనున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుధీర్‌తో నటిస్తున్న కన్నడ చిత్రంలో కూడా గ్లామర్ రోల్‌లోనే కన్పిస్తుందట. మొత్తానికి అవకాశాలు సన్నగిల్లడంతో గ్లామర్ బాట పట్టింది నిత్యామీనన్!